రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుకుంపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుకుంపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త మండపాక హరి మణికంఠ గారు ప్రమాదశాత్తు మరణించిన వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.ఈ విషాద ఘటన తెలిసిన వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, హరి మణికంఠ గారి మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున అన్నివిధాలుగా తమ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చాను.హరి మణికంఠ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.