జిల్లా తెలగా సంక్షేమ సంఘం ఆత్మీయ కలయిక
ఈ నెల 28వ తేదీన వసంత విహార్ లో జిల్లా తెలగా సంక్షేమ సంఘం ఆత్మీయ కలయికను ఘనంగా నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్షులు ఎజ్జు మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొని సమస్యలపై చర్చించి, ఐక్యతను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సభ్యులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ ఆత్మీయ సమావేశం సంఘం అభివృద్ధికి కీలకమని అధ్యక్షులు వెల్లడించారు.