logo

టిడిపి జిల్లా అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య రెండోసారి.. రోలుగుంట బీజేపీ నాయకుల శుభాకాంక్షలు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబు రెండోసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా రోలుగుంట మండల భారతీయ జనతా పార్టీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా పార్టీ బలోపేతం మవుతుందని, ప్రజల అభివృద్ధికి కృషి చేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. చోడవరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మీ కర్రి తమ్ము నాయుడు, స్కూల్ కమిటీ చైర్మన్ చిటికెల వెంకటరమణ లు ఈ సందర్భంగా తాతయ్య బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

0
171 views