logo

సీఎం పదవికి మచ్చ తెస్తున్న రేవంత్ రెడ్డి ప్రవర్తన – కేటీఆర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి:

బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ !

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది రాష్ట్రాన్ని బాధ్యతగా పాలించేందుకు తప్ప, అసభ్య పదజాలంతో ప్రతిపక్ష నేతలను దూషించేందుకు కాదని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ . ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సంస్కారాన్ని పూర్తిగా మరిచి, వ్యక్తిగత స్థాయికి దిగజారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అత్యంత దిగజారిన రాజకీయాలకు ఉదాహరణగా నిలుస్తాయని. ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి సీఎం హోదాలో ఉండటం తెలంగాణ ప్రజలకే అవమానమని. తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమే కానీ, అసభ్యతకు ఎలాంటి చోటు లేదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సంయమనం పాటిస్తూ గౌరవంగా బాధ్యతగా మెలగాలని తన పాలనా వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు, ప్రజా సమస్యలపై ప్రశ్నలు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ విధమైన చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ బలహీన పాలనకు నిదర్శనమని అన్నారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, గత పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన నాయకుడని తెలిపారు. అలాంటి నాయకుడిపై సీఎం ఈ రీతిలో మాట్లాడి వారి చౌకబారు రాజకీయాలు రుజువు చేసుకున్నారని.సీఎం తన పదవికి తగిన గౌరవంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేటీఆర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

0
692 views