logo

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ శాసనసభ్యులు!

అదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ , ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు సమాన న్యాయం చేస్తుందని, బీజేపీ కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని చూస్తుందని, ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితి లో లేరన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ సోయం బాపూరావు,ఆదిలాబాద్ గ్రంథాలయ శాఖ చైర్మన్ మల్లెపూల నరసయ్య, డిసిసిబి చైర్మన్ అడ్డి బోజ్జ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు సాదిత్ ఖాన్ గుండ్రాత్ సుజాత, సంజీవరెడ్డి, బోరన్సు శ్రీకాంత్రెడ్డి, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

0
746 views