logo

రోలుగుంటలో హిందూ సమ్మేళనంలో దేశభక్తి జ్వాలలు

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట గ్రామంలో ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. రోలుగుంటతో పాటు మండల పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో హైందవ సోదరులు తరలివచ్చి దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.కార్యక్రమం ప్రారంభంలో దేశభక్తి గేయాలతో వేదిక అలరించగా, ప్రధాన అతిథిగా పాల్గొన్న భారతీయ సహధర్మ జాగరణ ప్రముఖ ఆలే శ్యాం కుమార్‌ హిందూ సమాజానికి ఆవశ్యకమైన ధర్మబోధన, దేశభక్తి ప్రేరణ అంశాలపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, “ప్రతి హిందువు దేశభక్తిని, దైవభక్తిని అలవర్చుకొని దేశ సేవలో భాగస్వామి కావాలి. ధర్మాన్ని రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది. కుటుంబ వ్యవస్థను కాపాడుతూ హైందవ ధర్మ విలువలను పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని” పిలుపునిచ్చారు.అలాగే భారత యువత విదేశీ మోహంలో పడకుండా స్వామి వివేకానంద బాటలో నడిచి దేశ ధర్మ పరిరక్షణకై కృషి చేస్తే భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజలు పౌరధర్మాన్ని నిర్వర్తిస్తూ నీతిగా, పరస్పర గౌరవంతో జీవించాలన్నారు.కార్యక్రమంలో కొవ్వూరు గ్రామానికి చెందిన రామాంజనేయ భజన బృందం వారు నిర్వహించిన భజనలు, సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలు ప్రేక్షకులను అలరించాయి. హిందూ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు సభలో పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి.కార్యక్రమం విజయవంతం కావటానికి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరిగా, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి హైందవ సోదరుడికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

57
4104 views