logo

రాజాంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు

రాజాంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు
రాజాం:
గాయత్రికాలనీ మెయిన్ రోడ్డులోని హోసన్నా అపోస్తిలిక్ మినిస్ట్రీస్ మహా దేవుడు యేసయ్య ప్రార్థన మందిరంలో బ్రదర్, పాస్టర్ రత్న కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు క్రిస్మస్ ప్రత్యేక నృత్యాలు, పాటలతో క్రొవ్వొత్తుల కాంతుల్లో యేసుక్రీస్తును ఆరాధించి భక్తి భావాన్ని చాటారు. పలు వీధుల్లో క్రిస్మస్ కేకులు పంపిణీ చేయడంతో పాటు వృద్ధులు, పేదవారికి వస్త్రాల పంపిణీ చేసి మానవత్వాన్ని ప్రతిబింబించారు.
ఈ క్రిస్మస్ సంబరాల్లో హోసన్నా అపోస్తిలిక్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులతో పాటు లోచర్ల, ఆమిటి, సీతారాంపురం, అరసాడ గ్రామాల నుండి వచ్చిన అనేక మంది క్రైస్తవులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

16
2398 views