logo

చోడవరం నియోజకవర్గంలో అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

అనకాపల్లి జిల్లా చోడవరం
భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ రమణమూర్తి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు శ్రీ బిజెపి శర్మ హాజరయ్యారు. అలాగే రోలుగుంట మాజీ మండల అధ్యక్షులు, చోడవరం మార్కెట్ కమిటీ డైరెక్టర్
శ్రీ కర్రి తమ్మునాయుడు
మరియు ప్రధాన కార్యదర్శి మామిడి రమణ అలాగే మండల ఉపాధ్యక్షులు చిటికెల వెంకటరమణ స్కూల్ కమిటీ చైర్మన్
మరియు జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మణికంఠ పాల్గొని అటల్ జీకి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి దేశ రాజకీయాల్లో ఆదర్శనీయ నాయకుడిగా, సమగ్ర భారతాభివృద్ధికి బాటలు వేసిన మహానాయకుడిగా నిలిచారని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, యువత ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక కార్యకర్తలు, అటల్ జీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చోడవరం నియోజకవర్గంలో ఈ 100వ జయంతి వేడుకలు ఉత్సాహభరితంగా, ఘనంగా ముగిశాయి.

0
1277 views