logo

ఆళ్లగడ్డ జనసేన కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

AIMA న్యూస్. క్రిస్మస్ సందర్భంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం రోజున తాలూకా జనసేన నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి, వారి సోదరులు ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తాలూకా ఎస్సీ సెల్ నాయకులు డాలు రత్నమయ్య మాట్లాడుతూ ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రేమ కరుణ ద్వారా ప్రపంచ మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అలాగే కూటమి ప్రభుత్వంలో క్రిస్టియన్ పాస్టర్లకు క్రిస్మస్ కానుకను అందించడం జరిగింది రాష్ట్రంలో 8,418 మంది పాస్టర్లకు గౌరవ వేతనం నిధులు విడుదల చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్, రంగస్వామి, సజ్జల నాగేంద్ర, దూదేకుల బాబు, సాదక్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు

142
5688 views