దస్తూరాబాద్ గ్రామ సర్పంచ్ వరేపల్లి గోపాల్ ప్రమాణస్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ !
గ్రామ సర్పంచ్ వరేపల్లి గోపాల్, ఉప సర్పంచ్ మల్లవ్వ, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామంలో ఏ సమస్య ఉన్న తన ద్రుష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని పాలకవర్గంకు హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దెందుకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కృషి చేయాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ముఖ్య అధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.