నీటి పారుదల శాఖ అధికారులతో పలు సమస్యలపై సమీక్ష.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ .
సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్తా.
ఉట్నూర్ క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా అధికారులు పలు సమస్యలను ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకువచ్చారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ మరమ్మత్తులపై, అడవి ప్రాంతాల ద్వారా ప్రవహించే కాల్వల మరమ్మతులకు అటల్ శాఖ అధికారుల అనుమతుల ఇబ్బందులను ఎమ్మెల్యేకు సూచించారు, కడెం ప్రాజెక్టుకు మహార్దశతో పాటు అలాగే ఇతర సమస్యలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టికి తీసుకెళ్తానన్నారు.
సదర్ మాట్, కడెం ప్రాజెక్టు నుండి చివరి ఆయకట్టు వరకు నీరు అందించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాలని అధికారులకు సూచించారు.