
మీడియా సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్ వైసీపీపై ఫైర్
*మీడియా సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్ వైసీపీపై ఫైర్*
గర్భిణీ పై దాడి చేసిన అజయ్ కు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అజయ్ కు జనసేన పార్టీలో సభ్యత్వం కూడా లేదు. అజయ్ పక్కా వైసిపి కార్యకర్త. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్తడే వేడుకల్లో పాల్గొనేది వైసిపి కార్యకర్తలు ఆ విషయం గ్రహించాలి.
పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అన్ని పార్టీలో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి అభిమాని అనే ప్రతి ఒక్కరు జనసేన పార్టీ కాదు, సినిమా వేరు రాజకీయం వేరు. స్తానిక రాజకీయ పరిస్తితుల్లో ఏ పార్టీలో ఉన్నా ఉండొచ్చు.
పనిగట్టుకుని వైసీపీ సోషల్ మీడియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. వైసీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదు.
అజయ్ అనే వ్యక్తి ఏ రోజు జనసేన పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. ఒక వ్యక్తిని ట్రాప్ చేసి ఆ వ్యక్తి మాటలు పరిగణలోకి తీసుకొని దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? మహిళలను గౌరవించే పార్టీ జనసేన, నిండు గర్భిణీ పై వైసీపీ కార్యకర్త దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము.
తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడడం వైసిపికి వెన్నతో పెట్టిన విద్య. మహిళల జోలికొస్తే తాట తీయమని చెప్పింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న సంగతి వైసీపి పార్టీ గుర్తుపెట్టుకోవాలి. వైసిపి కార్యకర్తపై పోలీసుల స్పెషల్ ట్రీట్మెంట్ ను సమర్థిస్తున్నాం.