logo

మెగా మార్ట్ ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్: ట్రాఫిక్ సీఐ చాన్ బాషా.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణంలోని మెగా మార్ట్ ప్రాంతం తో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ట్రాఫిక్ సీఐ చాన్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.ట్రాఫిక్ సీఐ చాన్ బాషా తన సిబ్బందితో కలిసి రహదారులపై అడ్డంగా నిలిపిన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను సజావుగా నడిచేలా చర్యలు తీసుకున్నారు. వాణిజ్య ప్రాంతాల్లో వాహనాల అక్రమ పార్కింగ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని లోనే నియంత్రణ చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చాన్ బాషా మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అనుమతించిన ప్రదేశాల్లోనే వాహనాలను నిలిపివేయాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ట్రాఫిక్ సిబ్బంది కృషితో మెగా మార్ట్ ప్రాంతంలో వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు.

10
773 views