బాలానగర్ జోన్ అడిషనల్ డీసీపీగా ఎం. సుదర్శన్ నియామకం
బాలానగర్ జోన్ అడిషనల్ డీసీపీగా ఎం. సుదర్శన్ నియామకం
తెలంగాణలోని పోలీస్ శాఖలో మరోసారి బదిలీలు జరిగాయి. నాన్ క్యాడర్కు చెందిన సూపరింటెండెంట్లు, అడిషనల్ సూపరింటెండెంట్లు బదిలీ చేశారు. CID అడిషనల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఎం.సుదర్శన్ను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్ అడిషనల్ డీసీపీగా నియమిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ CV ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మరో ఆరుగురు ఆఫీసర్లను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.