మెంటాడ మండల యు.టి.ఎఫ్. నూతన కార్యవర్గం ఎన్నిక
మెంటాడ:
మెంటాడ మండల యు.టి.ఎఫ్. (యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే క్రమంలో గజపతినగరం తాలూకా యు.టి.ఎఫ్. కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల అధికారిగా జిల్లా ఆడిట్ కన్వీనర్ కిల్లాడ అప్పారావు , ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ట్రెజరర్ చింత భాస్కరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెంటాడ మండల యు.టి.ఎఫ్. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా ఏ. సూరిబాబు, అధ్యక్షులుగా కె. సన్యాసిరావు, సహ అధ్యక్షులుగా కె. సత్యనారాయణ, ట్రెజరర్‌గా బి. మురళి, మహిళా అధ్యక్షురాలిగా కె. నాగమణి ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని క్లస్టర్ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే పలువురు ఉపాధ్యాయులు పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. విద్యా రంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యు.టి.ఎఫ్. కృషి చేస్తుందని నూతన నాయకత్వం పేర్కొంది.