logo

*జంఝావతి సాధనే లక్ష్యం...!* *సాధన దీక్షలకు సమాయత్తం *బాధిత గ్రామాల్లో పర్యటించిన సాధన సమితి ప్రతినిధులు*


జంఝావతి సాధన సాధించడమే తమ లక్ష్యమని జంజావతి సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కరరావు అన్నారు. ఆ సమితి ప్రధాన కార్యదర్శి పల్లి రాజ గోపాల్ నాయుడు, కార్యనిర్వాహాక కన్వీనర్లు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తి నాయుడు, వంగల దాలి నాయుడు తదితరులతో కలిసి జంఝావతి బాధితు గ్రామాలైన సోమినాయుడు వలస, గంగ రేగువలస, కుమ్మరి గుంట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆయా గ్రామాల్లోని పెద్దలు, రైతులు, నాయకులు అగ్గాల దాలినాయుడు, గంగు నాయన కోటేశ్వరరావు, పడాల సత్యం నాయుడు, మరిశర్ల సింహాచలం, తెంటు శ్రీకర్, మరిపి అప్పలనాయుడు తదితరులతో కలిసి రైతులతో గ్రామ కమిటీల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని జంఝావతి ప్రాజెక్టులో ఉన్న ఆయుకట్టు భూములపై చర్చించారు. ప్రాజెక్టు పూర్తి కాకపోవటంతో సాగునీరు లేక రైతులు వలస బాట పడుతున్నారని వారు ఆవేదన చెందారు. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నారు. రైతులు వలస పోయే పరిస్థితి ఉండదన్నారు. గత 50 ఏళ్లుగా ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశతో ఎదురుచూస్తున్నామన్నారు. పాలకులు అధికారుల నుండి స్పందన లేదన్నారు. దీంతో ప్రజలు పేదరికంతో మగ్గుతున్నారన్నారు. ప్రాజెక్టుల నీరు వృధాగా పోతోందని, సాగునీరు లేక రైతులు సాగు మానుకునే దుస్థితి ఏర్పడుతుందన్నారు. అందుకే ప్రాజెక్టు సాధన లక్ష్యంగా సమితిలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏర్పాటుచేసిన బాధిత గ్రామాల సమితులతో త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సాధన దీక్షలు ప్రారంభిస్తామన్నారు. కాబట్టి రైతులందరూ ఏకమై పూర్తిస్థాయి ప్రాజెక్టును సాధించుకునేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సమితులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు, సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

2
25 views