రోలుగుంట మండలంలో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పేరు మార్పుపై ప్రత్యేక గ్రామ సభలు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.) పేరును "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ చట్టం"గా మార్చిన కేంద్ర విధాన మార్పుల నేపథ్యంలో, రోలుగుంట మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో డిసెంబరు 26న ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, విజయవాడ మరియు అనకాపల్లి జిల్లా కలెక్టర్ మౌఖిక సూచనల మేరకు జారీ చేసిన ఈ పత్రం ప్రకారం, కొత్త చట్టం లక్ష్యాలు, అమలు విధానాలు, ఉపాధి అవకాశాలు, గ్రామీణ జీవనోపాధి బలోపేతంపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలి. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సమాచార పత్రాలను సిద్ధం చేసి, సభలు విజయవంతం చేయాలి.మహిళా సంఘాలు, యువకులు, ప్రజాప్రతినిధుల పాల్గొనడంతో అభిప్రాయాలు సేకరించనున్నారు.కేంద్ర చట్టం 2025లో అమలులోకి వచ్చినట్లు ప్రజలకు వివరించాలి.ఈ సభలు మండల అభివృద్ధికి మైలురాయిగా మారతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమం ఎంపీడీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది