*తప్పతాగి రైలుపట్టాలపై ఆటో నిలిపి.. వందేభారత్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం*
* కేరళలో వందే భారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై ఓ ఆటో ఆగి ఉండడాన్ని గమనించిన లోకోపైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. తిరువనంతపురంలోని అకతుమురి హాల్ట్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.