logo

సర్పంచ్‌లను ఘనంగా సన్మానించిన ఉస్మానియా తెలంగాణ విద్యార్థి నేత దాసరి శ్రీనివాస్

సర్పంచ్‌లను ఘనంగా సన్మానించిన ఉస్మానియా తెలంగాణ విద్యార్థి నేత దాసరి శ్రీనివాస్* పవర్ తెలుగు దినపత్రిక 23-12-2025 భీమారం (రెడ్డిపల్లి): భీమారం మండలం ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లికి చెందిన ఉస్మానియా తెలంగాణ విద్యార్థి విభాగం నేత దాసరి శ్రీనివాస్ పలువురు సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రజా ప్రతినిధులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ సన్మానించిన వారిలో కాజిపల్లి సర్పంచ్ కొండ శ్యామల ధర్మారం సర్పంచ్ దాసరి మణిదీపక్ నర్సింగాపూర్ సర్పంచ్ పెద్దల బాబు దాంపూర్ సర్పంచి చేగొండ కుమార్ ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ,సర్పంచ్‌లు తమ పరిధిలోని గ్రామాలను ఆదర్శంచే గుంతీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. విద్యార్థి లోకం ఎల్లప్పుడూ సామాజిక అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని ఆయన తెలిపారు. తమను గౌరవించి సన్మానించినందుకు సర్పంచ్‌లు శ్రీనివాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.

16
543 views