లక్ష్యసాధన దిశగా: విజయనగరంలో ఉద్యాన విప్లవం: రెండు సీజన్లలో 10,000 ఎకరాల అదనపు సాగు.
ఉద్యాన పంటల విస్తరణ దిశగా జిల్లా కొత్త అడుగులు వేస్తోంది. జిల్లాలో కొత్తగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగుకు విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. రబీ సీజన్లో 4,000 ఎకరాలు, ఖరీఫ్లో 6,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ అంశాలపై బుధవారం డీఆర్డీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.