logo

సమాచార హక్కు కార్యకర్త సంఘం క్యాలెండర్ల ఆవిష్కరణ

సమాచార హక్కు కార్యకర్త సంఘం క్యాలెండర్లను ఆర్ టి ఐ యాక్ట్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు వడ్డే విశ్వనాథ్ రాజు, నియోజకవర్గ సభ్యుడు వెంకటగిరి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక హోళగుంద ఎంపిడిఓ విజయ లలిత , ఎమ్మార్వో నిజాముద్దీన్ తదితరులు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం (RTI Act) 2005లో భారతదేశంలో అమల్లోకి వచ్చింది, ఇది పౌరులకు ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని పొందే అధికారం ఇస్తుంది, పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతుందని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకునేవారు rtiassociation.com అనే వెబ్సైట్లు చట్టానికి సంబంధించిన సమాచారం పొందుపరిచి ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ ఆర్టిఐ యాక్ట్ అసోసియేషన్ సభ్యుడు మంజు, apuwj మండల అధ్యక్షుడు నాగరాజు,సభ్యుడు మంజు, తాహిర్, పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్,అరుణ్ కుమార్. పెద్దహ్యేట మల్లయ్య, వీరభద్ర, వీరేష్ , తదితరులు పాల్గొన్నారు.

13
885 views