logo

చెంచులకు అండగా కూటమి ప్రభుత్వం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

AIMA న్యూస్ బ్యూరో. వెదురు ఉత్పత్తులపై ఆధారపడి జీవించే చెంచులు, మేదరులపై ఫారెస్ట్ అధికారులు విధించిన ఆంక్షలు బాధాకరమైనవని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి చెంచులు మేదరులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వివరించారు అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. చంచులకు , మేదరులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అభిప్రాయం వ్యక్తం చేశారు.

141
4193 views