logo

గుంతలు లేని రోడ్లుగా ఏపీని తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం.బీసీ.

*గుంతలు లేని రోడ్లుగా ఏపీని తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం.*
• జనవరి ఆఖరుకల్లా రహదారుల మరమత్తులు పూర్తి చేస్తాము.
• మండల, జిల్లా కేంద్రాలకు అనుసంధానించే 85 రహదారులు పురోగతిలో ఉన్నాయి.
• పీపీపీ, హైబ్రిడ్ ఆన్యుటీ పద్ధతులలో స్టేట్ హైవేస్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు
రాష్ట్ర ఆర్ అండ్ బి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖామాత్యులు బి.సి. జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 10,294 కి.మీ.రహదారుల మరమత్తులు, అభివృద్ధికి రూ.3వేల కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ఆర్ అండ్ బి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖామాత్యులు బి.సి. జనార్థన్ రెడ్డి తెలిపారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ స్టేట్ హైవేలు, జిల్లాల, మండలాల రహదారుల మరమత్తు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇటీవల వచ్చిన తుఫాన్ ల దెబ్బకు మరికొన్ని రహదారులు మరమత్తులకు గురయ్యాయని, వాటిని సైతం త్వరలోనే పూర్తి చేసి ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉండే రహదారులను అందుబాటులోకి తీసుకువస్తామని హామి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రహదారుల నిర్మాణం, మరమత్తులకు అధిక ప్రాధాన్యత కల్పించిందని, ఇందుకోసం అవసరమైన నిధులను విడుదల చేయడం జరిగిందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రంగా తయారు చేయడానికి మిషన్ పాట్ హోల్ లో భాగంగా 2024-25 సంవత్సరానికి గాను 20,060 కి.మీ రోడ్ల పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. మరమత్తలు నిమిత్తం రూ. 861 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇక 2025-26లో, భారీ వర్షాలు, అధిక వర్షాలు, 'మొంథా', 'డిట్వా' తుఫానుల కారణంగా రోడ్లు మరింత దెబ్బతిన్నాయన్నారు. ఈ రోడ్లన్నింటినీ మరమ్మతు చేయడానికి, ఈ సంవత్సరం ఇప్పటివరకు 6035 కి.మీ మేర రోడ్లను మెరుగుపరచడానికి మరియు పునరుద్ధరించడానికి ప్రభుత్వం రూ. 2500 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. అంతేకాకుండా 4259 కి.మీ మేర MDR మరియు రాష్ట్ర రహదారులపై మరమ్మతులు చేయడానికి ఆర్థిక శాఖకు మరో రూ. 500 కోట్ల ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఇందులో భాగంగా నాబార్డ్ (NABARD) సహాయం కింద 191 MDR రోడ్లను (1250 కి.మీ పనులు) మెరుగుపరచడానికి రూ. 400 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ పనులన్నింటికీ టెండర్లను ఆహ్వానించడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్లు ఇప్పటికే 52 పనులు పూర్తి చేయగా, 132 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఇక రాష్ట్ర రహదారుల ప్రణాళిక క్రింద 856 కి.మీ. మేర అభివృద్ధి చేయడానికి రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో 139 పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించగా ఇప్పటి వరకు 6 పనులు పూర్తయ్యాయని, 113 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
MDR ప్లాన్ కింద, 536 కి.మీ. మేర మెరుగుపరచడానికి 86 పనులు సుమారు రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేయగా, వీటిలో 2 పనులు పూర్తయ్యాయని, 78 పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ పనులన్నీ మార్చి 2026 నాటికి పూర్తిచేస్తామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా అదనపు ప్రణాళిక కింద 166 MDR పనులకు రూ. 600 కోట్లు, 108 SH (రాష్ట్ర రహదారి) పనులకు రూ. 400 కోట్లు మంజూరు చేశామన్నారు. వీటిలో 161 పనులు కాంట్రాక్టర్లకు అప్పగించగా మిగిలిన పనులు టెండర్లు ఈనెలాఖరు లోపు పిలుస్తామన్నారు. ఈ పనులన్నీ 2026 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. అలాగే CRF, NDB, SDMF మరియు ప్లాన్ వర్క్స్ లు చేయబడిన మరియు దెబ్బతిన్న పనులను మెరుగుపరచడానికి ప్రభుత్వం రూ. 500 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. వీటిలో, 607 కి.మీ మేర మెరుగుపరచడానికి 106 రద్దు చేయబడిన పనులకు రూ. 276.58 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ పనులు జూన్ 2026 నాటికి పూర్తిచేస్తామన్నారు. అలాగే 647 కి.మీ రోడ్లను మెరుగుపరచడానికి రూ. 205.12 కోట్లతో 126 పనులు గుర్తించామని, ఈ పనులకు త్వరలోనే పరిపాలనా అనుమతి ఇస్తామన్నారు. అంతేకాకుండా 4259 కి.మీ మేర మెరుగుపరచడానికి 866 పనులకు రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించామన్నారు. అనుమతులు రాగానే వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. NDB కింద, గ్రామాలను మండల కేంద్రాలు మరియు జిల్లా కేంద్రాలతో అనుసంధానించడానికి 85 రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయని, 682 కి.మీ. రహదారులను సింగిల్ లేన్ నుండి 2 లేన్‌కు విస్తరిస్తున్నామన్నారు. వీటిలో ఇప్పటి వరకు 236 కి.మీ పూర్తయ్యాయని తెలిపారు. CRF రోడ్డు స్కీమ్ క్రింద 53 పనులు, 703 కి. మీ. మేర సుమారు రూ. 882 కోట్ల విలువైన పనులు పురోగతిలో వున్నాయన్నారు.
*రహదారులు - అభివృద్ధి - పి.పి.పి (PPP) / బి.ఓ.టి (BOT) పద్ధతి*
మన రాష్ట్రంలో 12,653 కి.మీ రాష్ట్ర రహదారులు ఉన్నాయని, సగటున ప్రతి సంవత్సరం 5% వృద్ధి రేటుతో వాహనముల సంఖ్య పెరుగుతున్నాయని, వాహనముల రద్దీని అనుసరించి రహదారుల విస్తరణ, అభివృద్ధి మరియు నిర్వహణ చేయవలసిన అవసరముందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ చేపట్టకపోతే వాహనముల సగటు వేగం తగ్గడంతో పాటు, ప్రమాదములు ఎక్కువగా జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని, అందుకనే రద్దీ ఎక్కువగా ఉన్న 20 రాష్ట్ర రహదారులను గుర్తించి, వాటిని 4 లేన్లుగా / రెండు లేన్ల హార్డ్ షోల్డర్స్ గా వెడల్పు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. పీపీపీ పద్దతిలో రహదారుల విస్తరణ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. కేంద్రం సైతం ఇదే పద్దతిలో రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు చేయడుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 20 రహదారులలో సర్వే నిర్వహించి, 40% వరకు 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్' కు అర్హత కలిగిన 709 కి. మీ. పొడవైన 12 రహదారులను గుర్తించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 40% వరకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉన్న రహదారుల విస్తరణకు 20% శాతం నిధులను కేటాయిస్తుందని తెలిపారు. ఇందుకు గాను భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ కు అవసరమయిన నిధులను మరియు మిగిలిన 20% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ 12 రహదారుల విస్తరణకు అంచనా విలువ రూ.5,894 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మరియు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొరకు రూ.3,292 కోట్ల రూపాయలను ఖర్చు చేయవలసివస్తుందన్నారు.
*టోల్ విధానం - అపోహలు మరియు వాస్తవాలు*రహదారి టోల్ విధించడం అంటే సామాన్య ప్రజలను దోచుకోవడం అనే దుష్ప్రచారం జరుగుచున్నదని ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. రహదారులపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు, త్రిచక్ర వాహనదారులు (ఆటోలు) మరియు వ్యవసాయం కోసం ఉపయోగించే ట్రాక్టర్లకు ఎటువంటి టోల్ ఉండదని నొక్కి వక్కాణించారు. అంటే సామాన్య ప్రజలకు టోల్ వర్తించదని, కేవలం నాలుగు చక్రాల వాహనములు (కార్లు, జీపులు) మరియు సరకుల రవాణాకు ఉపయోగించే లారీలకు మాత్రమే టోల్ వర్తిస్తుందని వివరించారు.
ఆన్యుటీ పద్ధతిలో రహదారి అభివృద్ధి పనులు మొట్టమొదటగా రాష్ట్రంలో 2008-09వ సంవత్సరంలో చేపట్టి, కడప జిల్లాలో 203 కి.మీ రహదారులను 9 ప్యాకేజీలుగా విభజించి చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వంలో 2023 సంవత్సరాలలో ఆన్యుటీ విధానంలో 8 ప్యాకేజీ పనులకు 535.30 కోట్లతో అభివృద్ధి చేయడానికి పరిపాలన అనుమతులను ఇచ్చి, టెండర్లు కూడా పిలవడం జరిగిందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో కేంద్రం జాతీయ రహదారులను 'హైబ్రిడ్-ఆన్యుటీ' (Hybrid Annuity) పద్ధతిలో చేపడుతుందన్నారు. రాష్ట్ర రహదారుల విస్తరణకు ఉత్తమ పద్దతి అనుసరించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ ప్రజలకు భారం లేకుండా ఉండేవిధంగా టోల్ ఫీజులు ఉంటాయని తెలిపారు. గుంటూరు- తుళ్లూరు రహదారి నిర్మాణానికి రూ. 8.5 కోట్లు కేటాయించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. రూ. 3వేల కోట్లతో చేస్తున్న రహదారుల పనులకు ఇప్పటికే 85 శాతం టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ఈ పనుల పర్యవేక్షణకు రెండు జిల్లాలకు ఒక చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు.

25
1061 views