కార్పెంటర్ టింబర్ డిపో యజమానిని అభినందించిన ఆర్లగడ్డ పోస్టల్ ఇన్స్పెక్టర్ రామ్నాథ్
పోస్ట్ ఆఫీస్ వారి ప్రమాద జీవిత బీమా సౌకర్యం తెలుసుకున్న ఆర్లగడ్డ సత్రం వీధికి చెందిన టింబర్ డిపో యజమాని డి కృష్ణమాచారి మంగళవారం పట్టణంలోని కార్పెంటర్లందరికీ మెగా క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోస్టల్ ఇన్స్పెక్టర్ రామ్నాథ్ గారు ప్రారంభించారు. కార్పెంటర్లందరికీ తన సొంత ఖర్చుతో 5 లక్షల ప్రమాద జీవిత బీమా ప్రీమియం ఒక సంవత్సరం చెల్లించి దాతృత్వం చాటుకున్నారు. ఆయన సేవా బావ దృక్పథాన్ని కొనియాడారు ఇలాగే అనేక కంపెనీలు ముందుకు వచ్చి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టుమాస్టర్ లక్ష్మీ గురువయ్య, భాస్కర రావు , బ్రాంచి పోస్ట్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు