logo

​మారుతున్న టెక్నాలజీతోనే కేబుల్ రంగానికి భవిష్యత్తు: గణపతినీడి శ్రీనివాసరావు


మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని కేబుల్ ఆపరేటర్లు మరింత ముందుకు వెళ్లాలని వాజీ వన్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినీడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో జీ డిష్,వాజీ వాచ్హో యాప్ ల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా తనతో కలిసి ఆపరేటర్లు పని చేశారన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కేబుల్ లేని ప్రాంతాల్లోకి జీ డిష్ లను తీసుకుని వెళ్లి వినియోగదారులకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. తక్కువ ధరలకే జీ డిష్ లు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. 2016 లో ఇంటర్నెట్ ను కూడా వాజీ ఛానల్ ద్వారా వినియోగదారులకు పరిచయం చేసామన్నారు. ప్రస్తుతం జి డిష్ లు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు . జీ డిష్ సబ్ స్క్రిప్షన్ సేల్స్ సీనియర్ మేనేజర్ పి. వెంకట్రావు మాట్లాడుతూ డిటిహెచ్ క్వాలిటీ కి అలవాటు పడిన వారికి కూడా జీ డిస్ ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నామన్నారు. జీ- డిస్ లకు ఆపరేటర్లే రీఛార్జ్ చేసుకుని అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఊరు సిగ్నల్ ఆ ఊర్లో ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. వినియోగదారులు కు అనుగుణంగా అన్ని రకాల చానల్స్ ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. వాజీ వాచ్హో యాప్ ను కూడా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు జీ డిష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

6
293 views