logo

అనాధ పిల్లలకు అండగా 'స్పెక్ట్': కొత్త బట్టలు, విద్యా సామాగ్రి పంపిణీ


తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన ముగ్గురు నిరుపేద పిల్లలకు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ (స్పెక్ట్)తరఫున కొత్త బట్టలను సైలాడ శ్రీదేవి చేతుల మీదుగా అందజేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి,జనవిజ్ఞాన వేదిక జిల్లా ట్రెజరర్ షిణగం శివాజీ తెలిపారు.విజయనగరం మండలం కొండ కరకం గ్రామానికి చెందిన బంగారు లక్ష్మి,రాము,వరలక్ష్మిలు తల్లిదండ్రులను కోల్పోయి విజయనగరం రెయిన్బో ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు.ఈ విషయాన్ని జర్నలిస్ట్ పద్మ ద్వారా తెలుసుకున్న స్పెక్ట్ ప్రతినిధి శివాజీ స్పెక్ట్ చైర్మన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మికి తెలియజేయడంతో స్పెక్ట్ సంస్థ తరఫున ఆమె అందజేసిన సహకారంతో కొత్త బట్టలు,జామెంట్రీ బాక్స్,పెన్నులు పెన్సిళ్లు కొనుగోలు చేసి వారికి అందజేసినట్లు చెప్పారు.

10
429 views