
జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ కి వినతి పత్రం అందజేసిన అంబులెన్స్ యూనియన్ సభ్యులు.
నంద్యాల (AIMA MEDIA ): నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ను కలిసి 108 కాంట్రాక్ట్ అంబులెన్స్ యూనియన్ సభ్యులు వినతి పత్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ మేరకు కూటమి ప్రభుత్వ నాయకులకు వినతి పత్రం అందజేయాలని తెలపడంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని 108 ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా ప్రతి 108 అంబులెన్స్ ఉద్యోగికి జీవో నెంబర్ 49 ప్రకారం నెలకు రూ.4 వేల చొప్పున అదనంగా ఇవ్వాలని,108 సర్వీసులలో నెలకొన్న అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని కోరారు. భవ్య మెడికల్ సర్వీస్ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం epfo యాజమాన్య వాటాను యాజమాన్యమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.5సం//,10సం// సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి ఆటోమేటిక్ గా స్లాబ్ ఆఫ్జెడిషన్ చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందుకున్న నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి 108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అంబులెన్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.