logo

మస్కాపూర్ గ్రామ సర్పంచ్ దొనికేని లక్ష్మి దయానంద్ ప్రమాణస్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ .


ఖానాపూర్ : మండలంలోని మస్కాపూర్ గ్రామ సర్పంచ్ దొనికేని లక్ష్మి దయానంద్ ప్రమాణ స్వీకారానికి నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామంలో ఏ సమస్య ఉన్న తన ద్రుష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని పాలకవర్గంకు, మండల కేంద్రంలో మొదటి స్థానంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు, రోడ్లు, డ్రైనేజీలు సమస్యలు వీధి దీపాలు, ఇందిరమ్మ ఇళ్లు, ప్రతి కుల సంఘాలకు అని విధాలుగా ,హామీ ఇచ్చారు.
ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దెందుకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కృషి చేయాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ముఖ్య అధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

18
1025 views