నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన జిల్లా వడ్డెర నాయకులు.
నంద్యాల (AIMA MEDIA): నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనవరి 11 వ తేదీన నిర్వహించబోయే రేనాటి వీరుడు, మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు, గెరిల్లా యుద్ధ వీరుడు మరియు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్వ సైన్యాధ్యక్షుడు శ్రీ వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను జిల్లా హెడ్ క్వార్టర్ లో ఘణంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన వడ్డెర నాయకులు. ఇదే విషయం పై బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ అధికారి ఆహ్వానం మేరకు వెల్ఫేర్ కార్యాలయం వెళ్లి జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి తగిన సభ ప్రాంగణం విషయం మరియు తగిన సలహాలు,సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమం లో బీజేపీ సేవా పక్వాడ్ నంద్యాల జిల్లా కన్వీనర్ వడ్డే చల్లా మద్దిలేటి, మహానంది వడ్డెర అన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి వడ్డే తిరుపతి వెంకటేశ్వర రావు, శ్రీ ఒడ్డే ఓబన్న 6 వ తరం వారసులు వడ్డే మంజుల బాల నరసింహులు , వడ్డే గోగుల గోపాల్,ABOSS నంద్యాల జిల్లా అధ్యక్షులు వడ్డే బివిఎన్ రాజు , ట్రెజరర్ వడ్డే సంపంగి శివకృష్ణ, జనరల్ సెక్రటరీ వడ్డే కేతన సురేష్ లు పాల్గొన్నారు.