స్త్రీ శక్తి భవన్ లో ప్రకృతి వ్యవసాయ మండల స్థాయి సమన్వయ సమావేశం.
గోస్పాడు (AIMA MEDIA): గోస్పాడు మండల పరిధిలోని స్త్రీ శక్తి భవన్ లో ప్రకృతి వ్యవసాయ మండల స్థాయి సమన్వయ సమావేశం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ స్వప్నిక రెడ్డి ఆధ్వర్యంలో ఏపిఎం శ్రీనివాసులు సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయ విజయ గాధలు మరియు ప్రకృతి వ్యవసాయం లో మెలుకువలు భూసారం మరియు వాతావరణంలో మార్పులు పంటలపై ప్రభావం తెగుళ్లు మరియు పురుగులు సస్యరక్షణ పై సమీక్షించారు మరియు ఎన్ ఎం ఎన్ ఎఫ్ గ్రామాలలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా సమన్వయంతో అందరి భాగస్వామ్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ స్వప్నిక,ఆర్ఎస్కే సిబ్బంది, ఏపిఎం శ్రీనివాసులు,వెలుగు సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ ఆళ్లగడ్డ డివిజన్ ఇంచార్జి రామాంజనేయ రెడ్డి, మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరయ్యారు.