logo

గురురాజాలో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీ నందు గల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు దేశంలో గర్వించదగ్గ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లుగా స్కూల్ డైరెక్టర్ పి . షేక్షావలి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పి.దస్తగిరి రెడ్డి ,డైరెక్టర్ పి .మౌలాలి రెడ్డి విచ్చేసి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి వందన సమర్పణ గావించారు. విద్యార్థుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన గణిత శాస్త్ర నమూనాలు, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ తో కూడిన ఆక్టివిటీస్, ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గురురాజా ఓపెన్ ఆడిటోరియం నందు విద్యార్థుల ఆవిష్కరణలు, నమూనాలు, ప్రాజెక్టులు, ఆలోచనత్మక రీతిలో ,ప్రస్తుత పోటీ ప్రపంచంలో గణితం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా విద్యార్థులు బాల మేధావులుగా విజ్ఞానాన్ని సాధించే దిశలో దాదాపు 100 ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం గణిత శాస్త్రం పట్ల మేము తీసుకుంటున్నటువంటి విధి విధానాలే దీనికి నిదర్శనం. ముఖ్యంగా ఒలంపియాడ్ ఐఐటి విద్యార్థుల ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అద్భుతంగా ప్రదర్శించారు. విద్యార్థుల ఉపన్యాసాలు చక్కగా ఆలోచింపచేసాయి. గణిత శాస్త్ర దినోత్సవం పురస్కరించుకొని స్కూల్ అంతర్భాగంలో భాగంగా మ్యాథ్స్ బి ,క్విజ్ పోటీలు విజేతలకు మెడల్స్ అందజేసి వారి విజయాలను ప్రశంసించారు .ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయ బృందం గౌరవ చైర్మన్ కి ,డైరెక్టర్ ని పూలమాలతో సత్కరించారు.

3
78 views