logo

వైఎస్ఆర్సిపి కార్యకర్త మృతి.ప్రగడ సంతాపం తెలిపిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్.

నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రం లోని దళిత కాలనీ కి చెందిన
వైఎస్ఆర్సిపి కార్యకర్త
గంగుల కుటుంబ వీరాభిమాని
నందవరం రాముడు( టైలర్)
(63 ) ఆదివారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైయస్సార్సీపి సీనియర్ నాయకులు ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ గంధం వీర రాఘవరెడ్డి మృతుని ఇంటి దగ్గరకు వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు
రాముడు మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.వీరితో పాటు నాయకులు సాగునీటి సంఘం మాజీఅధ్యక్షులు కొల్లం పుల్లయ్య, ఎంపీపీ మబ్బు బాలస్వామి, నాయకులు కొల్లం కేసి
నరసింహులు,
తెలుగు చిన్న నాగన్న ,
నల్లవాగుపల్లి ఖాదర్, బాచుపల్లి పాములేటి, తదితరులు
ప్రగాఢ సానుభూతి తెలిపారు.

25
830 views