logo

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే :



నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం ,ఖానాపూర్ నియోజకవర్గ అబివృద్ధి కొరకై చర్చించిన డిసిసి అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ :
ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అటవీ సమస్యలు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, తాజా గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి ఖానాపూర్ నియోజకవర్గ ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీ బలోపేతంలో వెడ్మ బొజ్జు పటేల్ కృషిని అభినందించారు.
ముత్తోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి డీసీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని సమిష్టిగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఇటీవలి ముధోల్,నిర్మల్ నియోజకవర్గా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి అధిక మద్దతు లభించిన కారణాలను విశ్లేషించి, భవిష్యత్ వ్యూహరచనల్లో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
త్వరలో జరగబోయే కేస్లాపూర్ నాగోబా జాతర ఏర్పాట్లను వివరించిన వెడ్మ బొజ్జు పటేల్ , ఆ జాతర ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

18
1052 views