రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ భట్టి విక్రమార్క గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే :
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా పథకాల అమలు, గిరిజన ప్రాంతాల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలను వివరించిన ఎమ్మెల్యే, స్థానిక ప్రజల ఆశలు ప్రతిబింబించేలా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు.
అటవీ శాఖ పరిమితుల కారణంగా గిరిజన ప్రాంతాల్లో గృహనిర్మాణ పనులు నిలిచిపోయిన అంశాన్ని ప్రస్తావించారు. అలాగే చికమన్ ప్రాజెక్ట్, త్రివేణి సంగమ అభివృద్ధి, పులిమడుగు, నర్సాపూర్ J, ఆద్ కుమరం భీమ్ ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు.
పాదయాత్ర సందర్భంగా చేసిన హామీలను సాకారం చేసుకోవడమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే మార్గమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేస్లాపూర్ జాతరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు.