logo

11వ రాష్ట్ర స్థాయి బాల బాలికల దివ్వ ఖుర్ఆన్ కంఠస్థ క్వార్టర్ ఫైనల్ ప్రతిభా పోటీలకు అనూహ్య స్పందన.

నంద్యాల (AIMA MEDIA): ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ కులానికి స్టడీస్ ఆధ్వర్యంలో జరిగే 11వ రాష్ట్ర బాలబాలికల దివ్య ఖుర్ఆన్ కంఠస్థ నంద్యాల జిల్లా స్థాయి క్వార్టర్ ఫైనల్ ప్రతిభా పోటీలు జిల్లా కోఆర్డినేటర్ హాఫీజ్ షోయబ్ జమాన్ అధ్యక్షతన స్థానిక అంటి కోట మస్జిద్ లో జరిగాయి. జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ సమద్ ముఖ్య అతిథిగా హాజరై, పాల్గొన్న బాలబాలికలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు పంపిణి చేసారు. ఈ సందర్భంగా శ్రీ సమద్ మాట్లాడుతూ పిల్లలలో ఖురాన్ వాక్యాలు కంఠస్థం మరియు పఠనాసక్తి పెంపొందించడం తద్వారా వారిలోని ప్రతిభను వెలికి తీయడం కోసం చేసే కృషిలో భాగంగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడిస్ ద్వారా ఈ పోటీలు నిర్వహించడం నంద్యాలల జిల్లా స్థాయి లోనే ఎనభై పైగా పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొనడం అభినందనీయమన్నారు. చిన్నప్పటి నుండి ధర్మ గ్రంధాలు చదవటం వారిలో నైతిక విలువలు పెంపొందించబడి భవిష్యత్తులో ఉత్తమ యువతగా సమాజానికి ఉపయుక్తం అన్నారు. ఈ కృషిలో భాగస్వామ్యులైన హాఫీజ్ ఆలీములకు, పిల్లల తలిదండ్రులను సమద్ అభినందించారు. హాఫీజ్ షోయబ్ జమాన్ మాట్లాడుతూ నంద్యాలలో జరిగిన ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో నంద్యాలతో పాటు బనగానపల్లి, వెలుగోడు, సిరవెళ్ళ నుంచి కూడా విధ్యార్ధులు హాజరైనారని వయసును బట్టి మూడు గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపు నుండి ఎనిమిది మంది ఎన్నిక చేసి తదనంతరం సెమి ఫైనల్ కు, ఫైనల్ కు ఎన్నిక చేస్తాం అన్నారు. విజయం సాధించిన పిల్లలకు 20,15,10 వేలు బహుమతులు ఉంటాయన్నారు. ఈకార్యక్రమంలో జనాబ్ సి. యం జక్రియా కన్వీనర్ గా, జడ్జెస్ గా మౌలానా అబ్దుల్లా, మౌలానా హుసేన్, మౌలానా ముజీబ్ ఉమ్రీ, హాఫిజ్ అబ్దుల్ వాహిద్, హాఫీజ్ తయ్యిబ్, హాఫీజ్ రియాజ్, సయ్యద్ జమీలుద్దీన్ వ్యవహరించారు. జనాభాతో సాజీద్, జనాబ్ సద్దాం కో కన్వినర్లుగా వ్యవహరించారు.

15
590 views