logo

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏపీ ఎన్జీజిఓ రాష్ట్ర అధ్యక్షులు,* ఏపీ జెఎసి చైర్మన్... *ఎ. విద్యాసాగర్*


విజయవాడ :
ప్రభుత్వ విభాగాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సంఘటిత కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందని సంఘ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ తెలిపారు. విజయవాడ లోని ఎన్జీజిఓ హోమ్ లో ఆదివారం జరిగిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అలపర్తి విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను ప్రభుత్వం యధాతధంగా అమలు చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. గత పది సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. చాలీచాలని జీతాలు, పని భారం వంటి తీవ్రమైన సమస్యల తో సతమతం అవుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం పై ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి 151 జీవో ద్వారా 50% పెంచిందని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఒకటో తారీఖున జీతాలు వచ్చే ఏర్పాటు 2017లో చేసిందని దానికి ఏపీ ఎన్జీవో కృషి కారణమని తెలిపారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని, ఈ విషయమై ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం ప్రభుత్వ గుర్తుంచుకోవాలన్నారు. శాశ్వత ఉద్యోగులకు కల్పిస్తున్న ఏ ఒక్క సౌకర్యాన్ని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కల్పించడం లేదన్నారు. ప్రధానంగా జీతభత్యాలు పెంపుదల, హెచ్ ఆర్ పాలసీ అమలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్న కూటమి ప్రభుత్వం యిచ్చిన హామీ ని నెరవేర్చాలన్నారు . ఆప్కాసును యధాతధంగా ఉంచాలని, APCOS లో లేని ఉద్యోగులను కూడా ఆప్కాసులకు తేవాలని కోరారు.
వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ అప్పుడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని తెలిపారు. అలాగే చనిపోయిన ఉద్యోగులకు ఇచ్చే మట్టి ఖర్చులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అదే అమౌంట్ ని ఇవ్వాలన్నారు. వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అతి త్వరలో సంబంధిత అధికారులను, మంత్రులను కలిసి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని విద్యాసాగర్ తెలిపారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాణ్యం వేణు ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు మాట్లాడుతూ మెప్మా సెర్ప్ ఉద్యోగుల మాదిరి గా హెచ్ ఆర్ పాలసీ ని అన్ని ప్రభుత్వ శాఖలలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.అప్కాస్ట్ ద్వారా పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ వర్తింప చేయాలని కోరారు.కోశాధికారిసీనియారిటీ ప్రాతిపదికిన ప్రతి ఏడాది 10 శాతం జీతం పెంచాలని ఈ ఎస్ ఐ పి ఎఫ్ వర్తింపు చేయడం వంటి 20 డిమాండ్ పై తీర్మానం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు తెలిపారు.
సమావేశం లో రాష్ట్ర కోశాధికారి పి.బి. బాలసుబ్రమణ్యం, కృష్ణాజిల్లా అధ్యక్షులు సత్యవాడ సంతోష్ కుమార్, అనంతపురం ఎన్జీ జిఓ సంఘం అధ్యక్షులు బి. చంద్రశేఖర్ రెడ్డి, కమర్షియల్ టాక్సెస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. వెంకటేష్ బాబు, ఎన్ జి జి ఒ ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షులు వేమూరి వెంకటేశ్వర ప్రసాద్, విజయవాడ నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ వివిధ జిల్లాలకు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0
0 views