logo

రోలుగుంటలో హిందూ సమ్మేళనం భవ్యంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగం

అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం కేంద్రంలో జరగబోయే హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమ ఇన్‌చార్జ్‌ బి. దేవుడు బాబు ఆధ్వర్యంలో కొవ్వూరు గ్రామంలో ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారు జామున 4 గంటలకే మేలుకొలుపు భజన బృందాలు గ్రామ వీధులన్నింటిలోనూ సంచరిస్తూ భక్తి గీతాలు ఆలపించాయి.గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, గ్రామస్థులందరినీ రోలుగుంటలో జరగబోయే హైందవ సమ్మేళనానికి ఆహ్వానించారు. భజన బృందాల భక్తిసాన్నిధ్యంతో గ్రామం మొత్తానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, వృద్ధులు అందరూ ఉత్సాహంగా స్పందించి కార్యక్రమంలో పాల్గొనాలని కరపత్రం ఇచ్చారు.ఇన్‌చార్జ్‌ దేవుడు బాబు మాట్లాడుతూ, “హిందూ సమైక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణ, భక్తి భావ పరంపర కొనసాగింపు లక్ష్యంగా ఈ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. అందరూ తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని అన్నారు.కార్యక్రమానికి స్థానిక హిందూ సంఘ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భజన మండళ్లు కృషి చేస్తున్నారు. డిసెంబరు 25న జరిగే ఈ సమ్మేళనం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

0
24 views