డొంకాడ రామచంద్రరావుకు 'కళారత్న' పురస్కారం: నాటక రంగ సేవలకు అరుదైన గుర్తింపు...
గరివిడి పట్టణానికి చెందిన విశ్రాంత విఆర్ఓ, పౌరాణిక, సాంఘిక నాటక రంగ కళాకారుడు అయిన డొంకాడ రామచంద్రరావుకు హైదరాబాద్ కు చెందిన శిష్టకరణ లేఖ మాస పత్రిక వార్సికోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి శిష్టకరణ లేఖ అవార్డ్స్ లో కళారత్న అవార్డ్ ప్రధానం చేసి సత్కరించారు. ఈ అవార్డు రావడం పట్ల శిష్టకరణ సంఘం సభ్యులు వాండ్రంగి వెంకటేష్, బలివాడ సునీల్ కుమార్, వాండ్రంగి ధనంజయరావు, ఆర్ శ్రీనివాసరావు, సతీష్ కుమార్, జి వెంకటరమణ తదితరులు అభినందనలు తెలిపారు.