logo

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో పోలియో చుక్కల కార్యక్రమం

AIMA న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం PHC పరిధిలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం ఆదివారం రోజున నిర్వహించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ స్వాతి, డాక్టర్ లిఖిత్ రెడ్డి మాట్లాడుతూ. ప్రభుత్వ ఆదేశాల మేరకు 0 నుండి 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరిగింది అలాగే దిగువ అహోబిలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఒక ట్రాన్సిట్ పాయింట్ ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు కార్యక్రమంలో స్వాతి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ అక్షింతల సాయి తేజస్విని, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుగుణ, వైద్య సిబ్బంది కుసుమ తదితరులు పాల్గొన్నారు.

67
2528 views