logo

* పేదల పక్షపాతి జగన్ ఆశయాలే స్ఫూర్తి: మజ్జి శ్రీనివాసరావు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విజయనగరంలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. ఇందులో భాగంగా, విజయనగరం ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేతుల మీదుగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు కొండబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేదల పక్షపాతి, ఆపన్నుల పెన్నిధి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. తమ నాయకుడి పుట్టినరోజున ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మేలు చేయడం అభినందనీయమని కొండబాబును అభినందించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మరియు దివ్యాంగుల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

1
378 views