విజయనగరం జిల్లా టీడీపీ సారథులు వీరే: అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల లక్ష్మివరప్రసాద్
విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల లక్ష్మివరప్రసాద్ని నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. కిమిడి నాగార్జున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్ గా వ్యవహరిస్తుండంగా.. ప్రసాదుల లక్ష్మివరప్రసాద్ యాదవ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.