logo

రాష్ట్రస్థాయి ఎనర్జీ కన్జర్వేషన్ షార్ట్ వీడియో కాంపిటీషన్ నందు ద్వితీయ బహుమతి సాధించిన గురురాజ.

నంద్యాల (AIMA MEDIA): రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎనర్జీ కన్జర్వేషన్ వీడియో కాంపిటీషన్ నందు శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించినట్లుగా స్కూల్ డైరెక్టర్ పి షేక్షావలి రెడ్డి తెలిపారు. ఈ ఘనవిజయం ఓ ప్రత్యేకమైనది.ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుండి వరుసగా రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించిన ఏకైక పాఠశాలగా శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ చరిత్ర సృష్టించినది.. విజయవాడలో నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయనంద్ ఐఏఎస్ గారు ,ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చైర్మన్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ జెన్కో సీఈవో శ్రీ పి పుల్లారెడ్డి విజేతులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ ఎనర్జీ సంరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తూ సమాజానికి సందేశం ఇచ్చే వినూత్న ఆలోచనలతో రూపొందించిన వీడియో జూరీ సభ్యులు విశేషంగా ఆకట్టుకున్నట్టుగా సంస్థ ప్రతినిధులు విద్యార్థుల శాస్త్రీయ విజ్ఞానాన్ని అభినందించారు.గురు రాజా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను విద్యారంగంలోనే కాకుండా సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ లో కూడా ముందంజలో నిలుస్తూ భవిష్యత్ తరాల కు ఆదర్శంగా నిలుస్తుందని వారు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విజయానికి ఆధునిక టెక్నాల తో కూడిన విధివిధానాలతో చక్కని శిక్షణ అందించిన ఉపాధ్యాయ బృందానికి స్కూల్ డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

0
335 views