logo

ఘనంగా మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

గోస్పాడు (AIMA MEDIA): గోస్పాడు మండలం పసులపాడు గ్రామంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గ్రామంలో నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి పాల్గొని గ్రామ వైసిపి నాయకులతో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి,గోస్పాడు మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ ప్రసాద్ యాదవ్, సర్పంచులు గడ్డం లలితమ్మ, పుల్లయ్య,వైసీపీ నాయకులు కాంతారెడ్డి, చిన్న వెంకటసుబ్బారెడ్డి,భీమలింగేశ్వర రెడ్డి,త్రిలింగేశ్వర్ రెడ్డి,నాగరాజు, నాగేశ్వరావు మరియు గ్రామ వైసిపి నాయకులు పాల్గొన్నారు.

0
232 views