అల్లూరి జిల్లా కాఫీ రైతులను సత్కరించిన సీసీఆర్ఐ
చిక్ మంగళూరు లోని కేంద్ర కాఫీ పరిశోధనా సంస్థ వందేళ్ళ వేడుకలలో అల్లూరి జిల్లా గిరిజన కాఫీ రైతులను సత్కరించింది. సత్కారం అందుకున్న వారిలో అరకులోయ మండలం నుండి కొర్రా సావిత్రి, డుంబ్రిగుడ నుండి తాంగుల జిన్ను, హుకుంపేట మండలం నుండి వారబోయిని బొంజుబాబు, చింతపల్లి మండలంకు చెందిన బౌడ కుసలువుడు లు ఉన్నారు. ఈ రైతులు కాఫీ పంట దిగుబడి, నాణ్యత కొరకు మేలైన పద్దతులు పాటించారని సీసీఆర్ఐ ప్రతినిధులు పేర్కొన్నారు.