
ఘనంగా ఎల్.ఐ.సి. ఎవోఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- జెండా ఎగురవేసిన ఏజెంట్లు
ఘనంగా ఎల్.ఐ.సి. ఎవోఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- జెండా ఎగురవేసిన ఏజెంట్లు
జగిత్యాల:
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్. ఐ.సి. కార్యాలయ ఆవరణలో శనివారం ఎల్.ఐ.సి. ఎవోఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఎల్. ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో సంఘం యొక్క
జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. గత 22 ఏండ్లుగా ఎ వో ఐ సంఘం చేసిన కృషిని, సాధించిన విజయాలను ఈ సందర్భంగా తెలియజేశారు. పాలసీలపై జీఎస్టీ రద్దు, కార్పొరేట్ కంపెనీల కుట్రలు - వాటిపై సంఘం చేస్తున్న కృషి, ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్ మెంట్ ఆప్ అథారిటీ లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పాలసీదారులకు, ఎల్.ఐ.సి. సంస్థకు, ఏజెంట్ లకు ఎలాంటి నష్టాలు జరగకూడదని ఎవోఐ సంస్థ చేసిన కృషిని అభినందించారు. సంఘ సేవల పరంగా, కార్యక్రమాల పరంగా జగిత్యాల ప్రాంతానికి వచ్చిన మంచి పేరును,, ప్రత్యేక గుర్తింపును వారు వర్ణించారు. సంఘ సభ్యులకు తెలియపరచి సంబరాలు జరుపు కున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో అధ్యక్షులు ఆమందు రాజకుమార్, ప్రధాన కార్యదర్శి రేగొండ లక్ష్మికాంతం, కోశాధికారి మహంకాళి ప్రభాకర్, సమన్వయ కర్త చుక్క గంగారెడ్డి, ఉపాధ్యక్షులు రౌతు నర్సయ్య, సంఘ నాయకులు జల్దా అశోక్, గొల్లపల్లి రాజేశం, తూకుంట రాజారెడ్డి, ఫుల్కం జలపతి, ఏనుగు ఆనంద్ రెడ్డి, గాజుల శ్రీనివాస్, వాసం లింబాద్రి, తాటికొండ వినయ్, చెట్టే మల్లేష్, నఖాజా మొయిజోద్దీన్, వేముల రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.