logo

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం

శ్రీకాకుళం-ఎచ్చర్ల : శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండల పరిధిలో కేశవరావుపేట పంచాయతీ పరిధిలో వెనుక వైపు ఎన్ హెచ్ 16 హైవే పక్కన మహిళ మృతదేహం వెలుగు చూసింది.అటువైపునా వెళ్లిన కొందరు వ్యక్తుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే మృతురాలి స్వస్థలం కొత్తవలస పేరు గురువుబెల్లి. తులసీరత్నం. వయస్సు 50 సంవత్సరాలు భర్త పేరు గురుగుబెల్లి కూర్మారావు.

వీరికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఈ కుటుంబం నివసిస్తున్నది. శ్రీకాకుళం బలగ సమీపంలో తుపాకీ బిల్డింగ్ ప్రదేశంలో నివసిస్తున్నారు. మూతి గల కారణాలు సేకరించేందుకు శ్రీకాకుళం టూ టౌన్ సిఐ ఈశ్వరరావు, ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు, జీ శిగడం ఎస్సై.వి. సంగీత్ కుమార్, రంగస్థలం ఎస్సై చిరంజీవితో పాటు క్లూస్ టీం డాక్స్ క్యాడ్ సంఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించి ఈ యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సరోజ ఆసుపత్రికి తరలించారు.

1
137 views