logo

సముద్రంలో అలలధాటికి వృద్ధ మత్స్యకారుడు మృతి

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి: సముద్రంలో వేటకు వెళ్లి అలల బారినపడి వృద్ధుడైన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన శనివారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలో జరిగింది.భావనపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు రాజయ్య (60) సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాకాసి అలల బారిన పడి మృతి చెందారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మత్స్యకారుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తెచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

0
24 views