logo

ఇరువర్గాల మధ్య కొట్లాట

శ్రీకాకుళం: నగరంలోని అరసవల్లి జంక్షన్‌ వద్ద ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద శనివారం రెండు వర్గాల మధ్య జరిగిన కొ ట్లాటలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. శ్రీకాకుళం రూరల్‌ కిష్టప్పపేటకు చెందిన కొర్ను రాజు, వాంబే కాలనీకి చెందిన అంబటి తరుణ్‌ వేర్వేరుగా సప్లయర్స్‌ దుకాణాలు నడుపుతున్నారు. రాజుకు సప్లయర్స్‌ లావాదేవీలో తరుణ్‌ రూ.1.30 లక్షలు బకాయి ఉన్నాడు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావని రాజు అడగ్గా సోమవారం ఇస్తానని తరుణ్‌ చెప్పాడు. అయితే ప్రస్తుతం నీవు ఎక్కడ ఉన్నావని రాజు ప్రశ్నించగా.. అరసవల్లి జంక్షన్‌ వద్ద మద్యం దుకాణంలో ఉన్నట్టు తరుణ్‌ సమాధానం ఇచ్చాడు. దీంతో రాజు మరో ఇద్దరితో కలిసి అక్కడికి చేరుకుని ఇప్పుడే డబ్బులు ఇవ్వాలని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీసింది. రాజుతో ఉన్న ఇద్దరు, అలాగే తరుణ్‌తో ఉన్న మరో నలుగురు బాహాబాహీకి దిగి నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీనితో పలువురికి గాయాల య్యాయి. వీరంతా చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌లో చేరారు. రిమ్స్‌ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

3
100 views