logo

ఆరు కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు

శ్రీకాకుళం: శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం ఆరు కిలోల గంజాయితో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.ఎస్‌ఐ బాలరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా జిగిడి పదర్‌ గ్రామానికి చెందిన మార్క్‌ సబర్‌ ఇదే రాష్ర్టానికి చెందిన సామల్య అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైలోని లక్ష్మణ్‌ అనే వ్యక్తికి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే శనివారం కూడా 6.900కిలోల గంజాయితో చెన్నై వెళ్లేందుకు ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు చేరుకుని పార్కింగ్‌ ప్రదేశంలో వేచి ఉండగా అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా.. గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో గంజాయి స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మిగిలిన ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు

3
58 views