ప్రజలను ఆకట్టుకునేలా: మీ ఇంటికే ఆర్టీసీ కార్గో సేవలు.. 24 గంటల్లోనే డెలివరీ!
ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవం
లో భాగంగా నేడు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ ,ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ విదానాన్ని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ధరలలో అందిస్తున్నటువంటి కార్గో సేవలతో పాటు కార్గో డోర్ డెలివరీ మాసోత్సవం డిసెంబర్ 20వ తేదీన మొదలై జనవరి 19 తేదీ వరకు జరుగుతోంది. ఈ నెల రోజులు ప్రయాణికులు వారి బంధువులకి మిత్రులకి శ్రేయోభిలాషులకి వారికి నచ్చిన. పిండివంటలు ,బహుమతులు ,మరి ఎటువంటి డోర్ డెలివరీ వస్తువులనైనా సరే తక్కువ ధరలతోవారికి నచ్చిన పట్టణాలకి కేవలం 24 గంటల్లో 50 కేజీల వరకు ,పది కిలోమీటర్ల దూరం వరకు ఈ డోర్ డెలివరీ కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాస రావు, అసిస్టెంట్ మేనేజర్ సుమిత్ర, స్టేషన్ మేనేజర్ సత్యనారాయణ మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.